
టైమ్ వస్తది.. అప్పుడు చెప్తం మీ సంగతి: ట్రంప్
ఇరాన్‌పై యుద్ధానికి సహయ నిరాకరణ చేస్తున్న ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధానికి వెళ్తున్న అమెరికా ఫైటర్ జెట్స్‌కు అనుమతి నిరాకరించిన దేశాలపై ట్రంప్ సీరియస్ అయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో మీరు వ్యవహరించిన తీరును గుర్తుంచుకుంటామన్నారు. అవసరం ఉన్నప్పుడు అమెరికా సహయం చేయదని హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న మిత్ర దేశాలను మీ చావు మీరు చావండన్నట్లుగా మాట్లాడారు.




