బోయిన్‌పల్లి మండల ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు 11 కేవీ విద్యుత్ లైన్లపై ఎయిర్ బ్రేక్ స్విచ్‌లను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ ఏఈ ప్రశాంత్ ఆదివారం తెలిపారు. ఈ ఏబీ స్విచ్‌ల వల్ల లైన్లలో లోపాలను త్వరగా గుర్తించి, ప్రభావిత ప్రాంతాన్ని మాత్రమే వేరుచేసి మరమ్మతులు చేపట్టడం సులభమవుతుంది. దీనివల్ల మిగతా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు. విద్యుత్ అంతరాయాల సమయం తగ్గడంతో పాటు నిర్వహణ పనులు వేగవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు.