బోయినపల్లిలో ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ 2025-2026 కింద వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 118 మందిలో 89 మంది మంగళవారం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్. శరత్ బాబు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఎంపీడీవో, బ్యాంకు మేనేజర్లు, ఏఓ, వెటర్నరీ డాక్టర్, ఏపీఎం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అర్హులకు త్వరలోనే రుణాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.