ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం.. కిడ్నాప్, దోపిడీ

3చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం.. కిడ్నాప్, దోపిడీ
ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని కిడ్నాప్ చేసి బంగారు గొలుసు, నగదు దోచుకున్న ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ఈ నెల 10న సాయి ఆదిత్య అనే యువకుడిని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఆటోలో ఎక్కించి కొత్తపల్లి శివారుకు తీసుకెళ్లి దాడి చేశారు. అతని వద్ద ఉన్న పది గ్రాముల బంగారు గొలుసు, ఫోన్ దోచుకున్నారు. కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి రూ.13 వేలు వసూలు చేశారు. విషయం చెబితే చంపుతామని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you