రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు వల్ల మునిగిపోయిన గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని బీసీ సెల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఛైర్మెన్ కుస రవీందర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, మంత్రులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పునరావాసం, పరిహారం, మౌలిక వసతుల కల్పనలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు.