రామడుగు మండలం రంగసాయిపల్లెకి చెందిన పోతు రాజశేఖర్, కావ్య శ్రీల కుమార్తెకు పుట్టుకతోనే చెవులు వినబడవు, మాటలు రావు. బిడ్డకు మాటలు రావాలని ఆశతో, ఆస్తులు అమ్మి తలలో ఇంప్లాంట్ మెషీన్ వేయించారు. అయితే, రెండు చెవుల్లో హియరింగ్ పరికరాలకు సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక దాతల కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది.