కరీంనగర్: మున్సిపల్ బరిలో బుజ్జగింపుల పర్వం

557చూసినవారు
కరీంనగర్: మున్సిపల్ బరిలో బుజ్జగింపుల పర్వం
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో, టికెట్లు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీల అగ్రనాయకత్వం నిమగ్నమైంది. రెబల్స్‌గా పోటీ చేస్తే ఓట్లు చీలి గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. దీంతో సీనియర్ నేతలు రంగంలోకి దిగి, అలకబూనిన నాయకులతో చర్చలు జరుపుతూ, భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీలిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్