కరీంనగర్లోని క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ అని KNR జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలో 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 13 నుంచి మండల, మార్చి 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు 9704061725 నంబరును సంప్రదించవచ్చు.