కరీంనగర్: బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి

17చూసినవారు
కరీంనగర్: బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో తోట ఆదిత్య (34) అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఏర్పడిన సమస్యలతో మనస్తాపానికి గురై తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన 31 డిసెంబర్ 2025 ఉదయం 09:30 గంటలకు చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్