KNR మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలిని దొంగతనం ఆరోపణలపై టూటౌన్ పోలీసులు స్టేషన్‌లో కొట్టడం తీవ్ర సంచలనమైంది. బాధితురాలిని బెదిరించి కొట్టలేదని వీడియో రికార్డు చేయించినా, నిజం వెలుగులోకి రావడంతో సీపీ గౌస్ ఆలం కఠిన చర్యలు చేపట్టారు. లైన్ క్రాస్ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ.. విచారణలో తప్పు చేసినట్లు తేలడంతో ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా, మరో మహిళా కానిస్టేబుల్‌ను బదిలీ చేసినట్లు సమాచారం.