కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ శివారులో చైన్ హార్వెస్టర్తో వెళ్తున్న ఓడిసియం వాహనాన్ని కరీంనగర్ 1 డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హుజురాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తుండగా, మొలంగూర్ శివారులో వేగనిరోధకాల వద్ద వ్యాన్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న బస్సు వ్యాన్ను ఢీకొట్టింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బ్లూ కోట్ సిబ్బంది వివరాలు నమోదు చేసుకొని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.