పోలీస్ సేవా పతకాలలో కరీంనగర్ కమిషరేట్ అధికారులకు గుర్తింపు

10చూసినవారు
పోలీస్ సేవా పతకాలలో కరీంనగర్ కమిషరేట్ అధికారులకు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వ పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ కమిషరేట్ అధికారులు గణనీయమైన సంఖ్యలో చోటు దక్కించుకున్నారు. అడిషనల్ డీసీపీలు భీంరావు, వెంకట రమణ ‘మహోన్నత సేవా పతకాలకు’ ఎంపికయ్యారు. హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ తో పాటు పలువురు ‘కఠిన సేవా పతకాలు’ సాధించారు. అంకితభావంతో పనిచేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందిస్తూ, ఈ అవార్డులు మరింతమందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్