కరీంనగర్: కొడుకుపై తండ్రి కత్తితో దాడి

11చూసినవారు
కరీంనగర్: కొడుకుపై తండ్రి కత్తితో దాడి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో మంగళవారం మద్యం మత్తులో ఉన్న తండ్రి తన కొడుకుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రిటైర్డ్ ఉద్యోగి పెరుగు రవీందర్, మద్యానికి బానిసై ఇంటి వద్ద తిరుగుతున్నాడని, తన కొడుకు పెరుగు నరేష్ ను ఇంటికి రమ్మని పిలిచినప్పుడు, రానని చెప్పడంతో కత్తితో దాడి చేశాడని గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. గాయపడిన నరేష్ ను ఆస్పత్రికి తరలించారు. సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్