కరీంనగర్: అంగన్‌వాడీల్లో తొలి ముద్దకు కసరత్తు

757చూసినవారు
కరీంనగర్: అంగన్‌వాడీల్లో తొలి ముద్దకు కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అల్పాహారం అందించే తొలి ముద్ద పథకాన్ని అమలు చేయడానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలోని 2,135 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 42,600 మంది ఆరేళ్లలోపు పిల్లలకు ఉప్మా, కిచిడీ మిక్స్‌లను అల్పాహారంగా అందించనున్నారు. ఈ పథకం ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్