కరీంనగర్: రైతులకు సావే శరణ్యమా.. రైతుల ఆవేదన

2చూసినవారు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో నెలరోజులుగా ధాన్యం తరలించకపోవడంతో వర్షాలకు వడ్లు మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ లేక రైతుల భూముల్లోనే వడ్లు పోసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రోహిణి కార్తె రావడంతో తక్షణమే వడ్లు తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు తూకం కాంటాను గ్రామపంచాయతీకి తీసుకెళ్లి నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్