కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో ట్రాక్టర్ బోల్తా పడి బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీ చోటు రాయ్ (28) మృతి చెందాడు. మానకొండూరు మండలం, గట్టు దుద్దెనపల్లి గ్రామం నుంచి నర్సింగాపూర్ కు వస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.