క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురానుంది. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒలింపిక్, పారా ఒలింపిక్, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేలా 2026-27 బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. దీని ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు తోడ్పాటు లభించనుంది.