జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా టి యు డబ్ల్యూ జే( ఐ జే యు )జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పాత కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.