పీఎంజే దోపిడీ కేసులో కీలక నిందితుడైన సుభోద్‌సింగ్‌ను కరీంనగర్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం. బిహార్‌లోని పుర్నియా జైలులో ఉన్న అతడిపై పీటీ వారెంట్ అమలుకు అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడి గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు అరెస్టయ్యారు. చోరీలో వాడిన పిస్టళ్లు, బంగారు ఆభరణాలు తరలించిన కారును గుర్తించేందుకు బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.