కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో బతుకమ్మ సంబరాలు

2052చూసినవారు
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంప్రదాయ, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీపీ గౌష్ ఆలం కుటుంబసభ్యులతో పాటు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కమిషనరేట్ కు చెందిన మహిళా ఉద్యోగులు తమ తమ బతుకమ్మలను తీసుకువచ్చి, సాంప్రదాయ బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సాంస్కృతిక వైభవాన్ని చాటుకున్నారు.