కరీంనగర్ పట్టణంలో విద్యుత్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏడీఈ లావణ్య తెలిపారు. శ్రీరామ బుక్ స్టాల్ లైన్, బోదిసత్వ స్కూల్, ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్ ప్రాంతాల్లో ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ ఉండదు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.