తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. వారి బస్ పాస్‌ల గడువును జూన్ 16, 2026 వరకు పొడిగిస్తూ సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి. ముకుందరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ అధికారులకు సూచనలు అందాయి. ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు కూడా జూన్ 16 వరకు పొడిగించబడటంతో, బస్ పాస్‌లను కూడా అదే తేదీ వరకు చెల్లుబాటు అయ్యేలా చూడాలని అధికారులు కోరారు.