నెల్లూరు జిల్లా బోగోలు మండలం తిప్పవద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా ఇందూర్తి గ్రామానికి చెందిన సుధాగోని స్వామి (55) మృతి చెందారు. శ్రీకాళహస్తి నుండి విజయవాడకు కారులో వెళ్తుండగా టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపి పంక్చర్ చేయిస్తున్న సమయంలో అల్లూరు నుండి వచ్చిన బైక్ అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.