కరీంనగర్ పట్టణానికి చెందిన మహేందర్ అనే వ్యక్తిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2025 డిసెంబర్ 4న అరెస్ట్ చేసి జైలుకు తరలించే సమయంలో పోలీసులు సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు సీజ్ చేశారు. 2026 మార్చి 26న బెయిల్‌పై విడుదలయ్యాక, ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో తన బ్యాంకు ఖాతా నుండి రూ.6 లక్షలకు పైగా మాయమైనట్లు మహేందర్ గుర్తించారు. ఇంట్లోని 157 గ్రాముల బంగారం, వెండి పాత్రలు, హార్డ్ డిస్కులు, చెక్ బుక్కులు కూడా మాయమైనట్లు బాధితుడు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పలు ఖాతాలు సీజ్ చేసి, రూ.50 వేలు బదిలీ అవ్వకుండా ఆపారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఫోన్ నుండి 6 లక్షలు మాయం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.