కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో సిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలు 2026లో చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సినీ ప్రముఖులతో పాటు పలువురు నాయకులు ఈ వేడుకల్లో సందడి చేశారు.