ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. విద్యా సంస్థలు, హాస్టళ్లకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్లకు తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.