శాతవాహన విశ్వవిద్యాలయం (SU) పరిధిలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అపరాధ రుసుము లేకుండా మార్చి 13 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలని లేదా సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.