కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నేర చరిత్ర కలిగిన బోటనీ లెక్చరర్ శ్రీనివాస్‌ను వెంటనే తొలగించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని విధుల్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు లేకున్నా పాఠాలు చెబుతున్నారని ఆరోపిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీసీ స్పందించి లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.