స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, అభ్యర్థులు ప్రచారానికి వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. సమయం తక్కువగా ఉండటంతో, ప్రజలు పనులతో బిజీగా ఉండటం, ఉద్యోగాల నిమిత్తం బయట పట్టణాలకు వెళ్లిన వారిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి సారించారు. ఇంటింటి ప్రచారం కష్టతరం కావడంతో, ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకోవాలని అభ్యర్థులు యోచిస్తున్నారు.