రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన అనంతరం కరీంనగర్ వెళ్తున్న ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనం కొత్తపల్లి మండలం బావుపేట వద్ద రోడ్డుపై దిగబడింది. సిబ్బంది వాహనాన్ని బయటకు తీశారు. గతంలో తానే స్వయంగా అధికారులను ఆదేశించి బాగు చేయించినా, రోడ్డు మళ్లీ అధ్వానంగా మారడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు.