కరీంనగర్ జ్యువెలరీ చోరీ కేసులో కీలక మలుపు. నిందితుడి ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో బయటపడటంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఆడియోలోని సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గోదావరి తీర, అటవీ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.