కరీంనగర్ జిల్లా శంకరపట్నం గ్రామానికి చెందిన నాంపల్లి రాజుకుమార్ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని వెంటనే కేశవపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో, అతడిని అక్కడికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.