కరీంనగర్: మానసిక అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య

28చూసినవారు
కరీంనగర్: మానసిక అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
లక్షెట్టిపెట్ మున్సిపాలిటీలోని పేరి గంపలపల్లికి చెందిన అగ్గు రమేష్ (32) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని, చికిత్స పొందుతూ శనివారం కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మానసిక పరిస్థితి బాగోలేక పదేళ్లుగా చికిత్స పొందుతున్న రమేష్, తరచుగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేవాడని, గతంలోనూ ప్రయత్నించాడని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఈనెల 8న సొంత పొలంలో గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్న రమేష్‌ను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన రమేష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్