కరీంనగర్లోని పాత బజార్ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. బుధవారం ఉదయం నుంచే ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక పౌర్ణమిని అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారని ఆలయార్చకులు తెలిపారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున తులసిలో ఉసిరి మొక్కను పెట్టి కళ్యాణం జరిపిస్తే ఎంతో మోక్షమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.