మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలింగ్ కేంద్రాలను కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ శుక్రవారం తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల మధ్య దూరం పాటించాలని, విద్యుత్, తాగునీరు, లైటింగ్, వికలాంగుల కోసం ర్యాంపులు వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సూచించారు.