పౌర్ణమి పురస్కరించుకొని, కొండగట్టులో వెలసిన ఆంజనేయస్వామి సన్నిధానం ఉన్న కొండ చుట్టూ సోమవారం గిరిప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. సాక్షాత్తు అంజన్న స్వరూపంగా భావించే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగిపోయి మనశ్శాంతి, మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తులు కొండగట్టు దిగువ ప్రాంతాన ఉన్న అంజన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదక్షిణను ప్రారంభించారు.