నిన్న కురిసిన భారీ వర్షానికి కొండగట్టు గిరిప్రదక్షిణ మార్గంలో వర్షపు నీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన పైపు వద్ద మట్టి కుంగి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ రహదారిని పరిశీలించి, విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును త్వరగా బాగు చేయాలని, గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.