కోరుట్ల పట్టణంలోని అతి పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు తిరుప్పావై సేవ కాలం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బిరునంది నరసింహాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం తిరుప్పావై సేవా కాలాన్ని మహిళలు, భక్తులు నిర్వహించారు.