ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో భూ వివాదం ఘర్షణకు దారితీసి ఒక వ్యక్తి మృతి చెందాడు. చల్లూరి చంటి అనే వ్యక్తి నందికొండ రాజు, అతని కుమారుడు నిశాంత్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలైన నందికొండ రాజు మరణించాడు. నిశాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.