ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు 'లోక్ అదాలత్’

1చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు 'లోక్ అదాలత్’
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు న్యాయమూర్తులు ఈ అవకాశాన్ని కల్పించారు. కక్షిదారులు ఈ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమతో పాటు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్