నవంబర్ 30న కరీంనగర్లోని రాంనగర్ సిద్ధార్థ్ స్కూల్ వద్ద వీధికుక్కల దాడిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యాపారి వెంకట రమణారావు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.