రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్.. ముగ్గురికి గాయాలు

1678చూసినవారు
కమలాపూర్ మండలం ఉప్పల్‌లో ఆదివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లక్ష్మీపూర్ నుంచి అస్సాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్