కరీంనగర్ లో కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 21 Z0128) జగిత్యాల రోడ్డులో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు బస్సు ముందు టైర్ కింద పడిపోయి, కాలు నుజ్జునుజ్జయింది. స్థానికులు 108 సహాయంతో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.