కరీంనగర్లోని ప్రగతినగర్లో తాళం వేసి ఉన్న రెండు ఫ్లాట్లలో దుండగులు అర్ధరాత్రి కట్టర్తో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భారీగా బంగారం, వెండి అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి సీసీ ఫుటేజ్ను పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.