డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా, 2025 డిసెంబర్ 2న మంగళవారం హుజురాబాద్‌లోని గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు గణిత ఒలంపియాడ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది విద్యార్థులకు ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వి. లలిత చేతుల మీదుగా శంకర్ నారాయణ డిక్షనరీలను ప్రతిభ పురస్కారాలుగా అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం జి. రాజశ్రీ, పి. శ్రీధర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.