బోయినపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మేడే జెండా ఎగురవేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ, 1886 మే 1న చికాగోలో కార్మికులు పోరాడి ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాలు సాధించుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి 8 గంటల పని దినాన్ని 12-16 గంటలకు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.