కరీంనగర్ పట్టణంలో సిటి బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

4చూసినవారు
కరీంనగర్ పట్టణంలో సిటి బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
కరీంనగర్ నగర ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించే లక్ష్యంతో, డా. బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను బుధవారం ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బస్సులను ప్రారంభించారు. మొదటి దశలో కరీంనగర్-వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్-చింతకుంట, కరీంనగర్-కొత్తపల్లి హవేలీ అనే మూడు రూట్లలో ఈ బస్సులు నడుస్తాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబెర్ పడాల రాహుల్, మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్