ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ కార్మికులకు, శ్రమ జీవులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో హక్కుల సాధనకు ఐక్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకుని ముందుకు సాగాలని, రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా మరిన్ని సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.