
హైజంప్‌లో పూజా సింగ్ జాతీయ రికార్డు (వీడియో)
ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత టీనేజర్ పూజా సింగ్ మహిళల హైజంప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి, 14 ఏళ్లుగా సహన కుమారి పేరిట ఉన్న జాతీయ సీనియర్ రికార్డును 1.93 మీటర్లతో బద్దలు కొట్టింది. ఈ హరియాణా అమ్మాయి కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని కూడా అధిగమించింది. పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్‌లో నితిన్ గుప్తా, మహిళల డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్, పురుషుల డెకాథ్లాన్‌లో రాహుల్ జాఖడ్ స్వర్ణాలు సాధించారు. సాధన దేవి రజతం, నీరూ పాఠక్ కాంస్యం గెలుచుకున్నారు.




