కరీంనగర్‌లోని ఒక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చింతలతాడెం శివ గణేష్ మంగళవారం సాయంత్రం పాఠశాల నుండి అదృశ్యమయ్యాడు. ఆందోళన కలిగించిన ఈ ఘటన చివరకు సుఖాంతమైంది. ఆ బాలుడు రాత్రి 10:50 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉండగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతడిని గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడు ఎందుకు ఇంటి నుండి వెళ్లాడో చెప్పలేకపోయాడు. ఏది ఏమైనా, బాలుడు క్షేమంగా కుటుంబ సభ్యులకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.